
బుల్లితెర యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj) మరోసారి తన గ్లామర్ డోస్ ను పెంచేసింది. ఆమె తాజాగా తన భర్త భరద్వాజ్( Bharadwaj)తో కలిసి థాయ్‌లాండ్ బీచ్‌లో యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఇందులో భాగంగా భర్తతో తీసుకున్న ఫొటోస్ అండ్ వీడియోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవి కాస్త క్షణాల్లో వైరల్‌గా మారాయి.
ఇక ఈ ఫోటోస్ లో అనసూయ బికినీలో కనిపించి అందరికీ షాకిచ్చింది. అంతేకాదు భర్తపై తనకున్న ప్రేమను తెలుపుతూ స్పెషల్ స్టోరీని కు పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె పుష్ప 2(Pushpa2) తో పాటు విమానం(Vimanam) అనే సినిమాలో కూడా నటిస్తోంది.