మగజాతి పరువు తీస్తున్నారు.. నెటిజన్కు అనసూయ కౌంటర్

మగజాతి పరువు తీస్తున్నారు.. నెటిజన్కు అనసూయ కౌంటర్

హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్​ అనసూయ భరద్వాజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకరింగ్‌ తోపాటు వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. యాంకరింగ్, ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్, మూవీలతో ఫుల్‌ బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. గ్లామరస్‌ ఫొటోలు, కుటుంబంతో కలసి ఆడిపాడిన క్షణాలను పోస్టుల రూపంలో పంచుకుంటుంది. అప్పుడప్పుడు తన అభిప్రాయాలను కూడా షేర్‌ చేసుకుంటుంది. అయితే డ్రెస్సింగ్ విషయంలో తరచూ నెటిజన్స్ నుంచి ఆమె విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తన డ్రెస్సింగ్ పై కామెంట్ చేసిన ఓ నెటిజన్ మీద అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

మగజాతి పరువు తీస్తున్నారంటూ అనసూయ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు పిల్లల తల్లి అయి ఉండి.. పొట్టి దుస్తులు వేసుకుంటూ తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నారంటూ తనపై ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు ఆమె పైవిధంగా స్పందించింది. ‘దయచేసి మీరు మీ పని చూస్కోండి. నన్ను నా పని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు’ అని అనసూయ దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా అనసూయ దర్జా, ఆచార్య, గాడ్‌ ఫాదర్‌ చిత్రాలతో అలరించేందుకు ఆమె సిద్ధమవుతోంది. 

మరిన్ని వార్తల కోసం:

కేటీఆర్, డీకే శివకుమర్ మధ్య ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్

వరుణ్ తేజ్ మూవీకి టికెట్ రేట్ల తగ్గింపు

బెయిల్ రద్దు చేయాలని సిట్ చెప్పినా ఎందుకు చేయలే?