నాగబంధంలో అనసూయ కీలకపాత్ర

నాగబంధంలో అనసూయ  కీలకపాత్ర

‘పెదకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘నాగబంధం’.  నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. కిషోర్‌‌ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం మరో అప్‌‌డేట్‌‌ ఇచ్చారు మేకర్స్. నటి అనసూయ భరద్వాజ్ ఇందులో ఓ కీలకపాత్రను పోషిస్తోందని తెలియజేశారు.

 ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌‌లో పాల్గొంటున్న ఆమె..  సెట్స్‌‌ నుంచి రాయల్ లుక్‌‌లో కనిపిస్తున్న చేతులను ప్రజెంట్ చేసే ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పురాతన  ఆలయాల గుప్తనిధులను కాపాడే నాగబంధం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. నభా నటేష్, ఐశ్వర్య మీనన్  హీరోయిన్స్‌‌. జగపతి బాబు, రిషభ్‌‌ సహానీ, జయప్రకాష్, జాన్‌‌ విజయ్‌‌, మురళీ శర్మ, ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.