హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో ఉన్న వివాదంపై అనసూయ (Anasuya Bharadwaj) మరోసారి రియాక్ట్ అయ్యింది. తాజాగా జగపతి బాబు అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ సింబా. నేడు సింబా జూలై 24న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా అనసూయ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లైమ్ లైట్‌లో ఉన్నప్పుడు పద్దతిగా ఉండాలంటూ తనదైన శైలిలో చురకలు వేసింది. సోషల్ మీడియాలో వచ్చే గొడవలకు తాను ఇకపై ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకోవడం లేదని అనసూయ స్ప్రష్టం చేసింది. వివరాల్లోకి వెళితే..
సింబా ట్రైలర్‌లో అనసూయ కనిపించే సీన్‌లో విజయ్ దేవరకొండ పేరును ఉద్దేశిస్తూ డైలాగ్ రావడం మరింత ఆసక్తికరంగా మారింది. ట్రైలర్‌లో అనసూయ సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తోండగా..ఓ వ్యక్తి వచ్చి నీకు మహేష్‌బాబు లాంటి మొగుడు వస్తాడు అని అనడం, అప్పుడు అనసూయ మూతి తిప్పుకున్నట్లుగా చూడటం ఈ ట్రైలర్‌లో చూపించారు. పోనీ విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడు అని అతడు అనగానే.. వెంటనే అనసూయ చిరునవ్వులు చిందిస్తూ ట్రైలర్‌లో స్పెషల్ గా కనిపించింది. ఈ డైలాగ్స్ ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి. ఆకట్టుకుంటున్నాయి.
కాగా..సింబా ఈవెంట్ లో ఓ రిపోర్టర్ అనసూయను హీరో విజయ్ దేవరకొండ వివాదం గురించి ప్రశ్నించగా అనసూయ మాట్లాడుతూ..'సినిమాల ద్వారా ఎలాగైతే మెసేజ్‌లు ఇస్తారో నేను కూడా అలాగే మెసేజ్ ఇవ్వాలని రియాక్ట్ అయ్యాను. స్టేజ్ మ్యానర్స్ గురించే ఆ రోజు మాట్లాడాను. లైమ్‌లైట్‌లో ఉన్నప్పుడు పద్దతిగా ఉండాలి. ఆ పద్దతి అన్నది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొన్ని మితిమీరినప్పుడు అందరికి అర్థమవుతుంటాయి. ఆ రోజు ఎవరూ మాట్లాడకపోవడంతో నేను మాట్లాడాల్సివచ్చింది.మీడియా కూడా ప్రశ్నించలేదు.ఆ తర్వాత తప్పును ఎత్తుచూపించినందుకు నన్నే అందరూ తప్పుపట్టారు' అంటూ మీడియాపైనే అనసూయ సెటైర్లు వేసింది." అయితే ఈ ఇష్యూతో నేను కొంత నేర్చుకున్నాను, చెప్పాల్సిన విషయాన్ని సరిగ్గా కన్వే చేస్తే ఇంకా బాగుండేది, ఇప్పుడు విజయ్ తో ఎటువంటి ఇష్యూ లేదు” అని అనసూయ తెలిపింది.
#Anasuya on issue with #VD #Simbaa Trailer launch
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) July 24, 2024
pic.twitter.com/vGMIVqor6d
అయితే వీరిద్దరి మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. అర్జున్ రెడ్డి టైమ్‌లో సినిమాలోని కథ, కథనాలు, ప్రమోషన్స్‌లో విజయ్ ఆటిట్యూడ్‌ను విమర్శిస్తూ అనసూయ పోస్టులు పెట్టిందంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద వార్ కూడా జరిగింది. ఇక అప్పటి నుంచి విజయ్ ఫ్యాన్స్ అనసూయను దారుణంగా ట్రోల్ చేశారు. ఇక ఇటీవలే విజయ్ నటించిన లైగర్, ఖుషి సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో..విజయ్‌ని ఉద్దేశించి అనసూయ పెట్టిన పోస్టులు సైతం వైరల్‌గా మారాయి.