ఆ కంపు నాకు అంటొద్దు.. అందుకే దూరంగా ఉంటాను : అనసూయ

ఆ కంపు నాకు అంటొద్దు.. అందుకే దూరంగా ఉంటాను : అనసూయ

తన అందం, అభినయంతో చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నారు బుల్లితెర యాంకర్ అనసూయ(Anasuya). జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్న ఆమె.. ఆతరువాత యాక్టింగ్ వైపు అడుగులు వేశారు. అలా సినిమా అవకాశాలు ఎక్కువ అవడంతో.. జబర్దస్త్ షో మానేశారు. ఇక రంగస్థలం సినిమాలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాత్రలో అనసూయ నటనకు ప్రశంసలు దక్కాయి. 

ఓపక్క టీవీ, మరోపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు అనసూయ. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ అప్డేట్స్ ను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. ఇక తాజాగా మరోసారి తమ అభిమానులతో ముచ్చటించారు అనసూయ. ఇందులో భాగంగా మరోసారి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు అనసూయ. ఈ చిట్ చాట్ లో.. మీ మీద బ్యాడ్ గా కామెంట్స్, ట్రోల్స్ చేసేవారికి ఏం చెపుదాం అనుకుంటున్నారు అని అడిగాడు ఓ నెటిజన్. దానికి సమాధానంగా.. ట్రోలర్స్ అంటేనే వింత, వికారమైన జీవులు. అలాంటి వారికి ఎంత దూరంగా అంటే అంత మంచిది. ఆ కంపు నాకు అంటుకోకూడదు కదా.. అందుకే వారి గురించి చెప్పి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి ఈ కామెంట్స్ పై ట్రోలర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తెలుగులో పలు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప2 ఒకటి. ఈ సినిమాలో అనసూయ దాక్షాయణి అనే పాత్రలో కనిపిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.