
రీసెంట్‌గా ‘పుష్ప’లో డిఫరెంట్ లుక్‌లో కనిపించిన అనసూయ.. ప్రస్తుతం ఖిలాడి, పక్కా కమర్షియల్, రంగమార్తాండ వంటి చిత్రాలతో పాటు తమిళంలోనూ కొన్ని మూవీస్ చేస్తోంది. ఇప్పుడు మలయాళ సీమలోనూ అడుగుపెడుతోంది. మమ్ముట్టి హీరోగా అమల్ నీరద్ తెరకెక్కిస్తున్న ‘భీష్మపర్వం’లో కీలక పాత్రలో నటిస్తోంది అనసూయ. రీసెంట్‌గా తన లుక్‌ని రివీల్ చేశారు. అలిస్ అనే పాత్రని ఆమె పోషిస్తున్నట్టు కన్‌ఫర్మ్ చేశారు. మాలీవుడ్‌లో మంచి డెబ్యూ దొరికినందుకు సంతోష పడుతోందామె.