
బుల్లితెర యాంకర్‌గా, వెండితెర నటిగా టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న అనసూయ ..ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఎప్పుడు ఎవరి మీద ఫైర్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. తాజాగా ఓ ట్వీట్ పెట్టి కొత్త వివాదానికి తెర లేపింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది.
ఏమని ట్వీట్ చేసిందంటే..
'వావ్! నేను నిజంగా చాలా ముఖ్యమైన వ్యక్తిని. నా పరిచయం ఉన్నా లేకున్నా.. నాకు సంబంధం ఉన్నా.. లేకున్నా.. నా పేరు ఎత్తకుండా ఒక్క చర్చ కూడా జరగడం లేదంటే.. మీ అందరికి నేను అంతలా కావాలి అబ్బాయిలు.. నాపైనే ఎక్కువగా మీరంతా ఆధారపడుతున్నారన్న మాట. నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేక పోతున్నారు...' అంటూ ఓ ఎమోజీని జత చేసింది.
పేరు చెప్పలేదు కానీ...
అనసూయ తాజా ట్వీట్లో ఎవరి పేరూ ప్రస్తావించలేదు. దీంతో మళ్ళీ వివాదం ఎవరితో.. మిమ్మల్ని ఎవరేమన్నారంటూ నెటిజెన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అవేం పట్టించుకోవద్దు మేడమ్. వాళ్లు ఎప్పటికీ మారరు. ..వాళ్ల పాపాన వాళ్లే పోతారని తనకు కొందరు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కొందరు మాత్రం ‘మళ్లీ ఏమైంది ఆంటీ’ అని తనకు కోపం వచ్చేలా పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం అనసూయ అమెరికాలో ఉన్నారు. ఆమె న్యూజెర్సీలో ఉన్నట్లు సమాచారం.
దేవరకొండ వర్సెస్ అనసూయ..
అనసూయకు, విజయ్ దేవరకొండ అభిమానులకు కొద్ది కాలంగా ట్విట్టర్ లో వార్ నడుస్తోంది. విజయ్ నటిస్తున్న ‘ఖుషి’ మూవీ పోస్టర్‌లో ‘ది దేవరకొండ’ అని పెట్టడంపై అనసూయన ఘాటుగా స్పందించింది. ‘ది’ అంట.. పైత్యం మామూలుగా లేదు’ అంటూ పరోక్షంగా ట్వీట్ చేసింది. దీంతో విజయ్ రెచ్చిపోయారు. అనసూయను విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ‘విమానం’ మూవీ ప్రెస్ మీట్ సందర్భంగా ఇకపై అన్ని వివాదాలకు ఫుల్‌స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఆ టాపిక్ తీయలేదు. కానీ సడెన్‌గా లేటెస్ట్ ట్వీట్‌లో మరోసారి విజయ దేవరకొండ ఫ్యాన్స్ ను గెలికింది.