భైంసా, వెలుగు: సమాజ నిర్మాణంలో టీచర్లే ప్రధాన పాత్ర పోషిస్తారని అనసూయ పవార్ ట్రస్ట్ చైర్మన్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం భైంసా పట్టణంలోని ఎల్బీ కన్వెన్షన్ హాల్ లో నియోజకవర్గంలోని ప్రైవేట్ టీచర్లకు అనసూయ పవర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన రామారావు పటేల్మాట్లాడారు. నియోజకవర్గం విద్యాపరంగా ముందుండాలనే ఉద్దేశంతోనే సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
ట్రస్టు ద్వారా ప్రైవేటు ఉపాధ్యాయులందరికీ బీమా కల్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉపాధ్యాయులకు బోధించే అంశాలపై పారమిత్ర గ్రూప్ ఆఫ్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ రావు, సైకాలజిస్ట్ అండ్ కెరియర్ కౌన్సిలర్ సండ్ర సుధీర్ మెళకువలు వివరించారు. ఈ సందర్భంగా రామారావు పటేల్‌ను సన్మానించారు. కార్యక్రమంలో స్కూళ్ల డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ పటేల్, పుండలికి రావు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.