"విమానం" నుండి అనసూయ స్టన్నింగ్ లుక్

మే డే సంధర్బంగా అనసూయా స్టన్నింగ్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ "విమానం". విలక్షణ నటుడు సముద్రఖని, మీరా జాస్మిన్, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, రాజేంద్ర‌న్ ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్నాడు.

జూన్ 9న ప్రేక్షకుల ముందుకి రానుంది ఈ సినిమా. ఇక ప్రమోషన్స్ లో భాగంగా.. ఈ సినిమా నుండి అనసూయ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పిక్ లో అనసూయ రెడ్ కలర్ శారీలో మాసీగా కనిపిస్తుందో. చూస్తుంటే.. రంగస్థలం, పుష్ప, దర్జా మూవీలో లాగే ఈ సినిమాలో కూడా మంచి మాసీ క్యారెక్టర్ లో కనిపించనుంది అను.

ఇక ఇప్పటికే విమానం మూవీ నుండి రిలీజ్ ఐన సాంగ్స్ అండ్ పిక్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి చరణ్ అర్జున్ అందించిన సంగీతం మెజర్ హైలెట్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన రేలారే రేలారే సాంగ్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. యూట్యూబ్ లో ఈ సాంగ్ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన అనసూయ ఫస్ట్ లుక్ కి కూడా అదే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమాతో అనసూయ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటుందా అనేది చూడాలి.