Anchor Anasuya: అనసూయ ని ఆంటీ అన్న ఆకతాయి.. దమ్ముంటే రారా అంటూ సీరియస్..

Anchor Anasuya: అనసూయ ని ఆంటీ అన్న ఆకతాయి.. దమ్ముంటే రారా అంటూ సీరియస్..

టాలీవుడ్ ప్రముఖ నటి, యాంకర్ అనసూయ కాంట్రవర్సీలతో ఎక్కువగా పాపులర్ అవుతోంది. అయితే ఇటీవలే ఓ పాడ్ క్యాస్ట్ లో హ్యూమన్ లైఫ్ కూడు, గూడు, గుడ్డ వంటివాటితోపాటూ సె*క్స్ కూడా బేసిక్ నీడ్ అని చెప్పడంతో ఒక్కసారిగా అనసూయ కామెంట్లు వైరల్ అయ్యాయి. అయితే ఈసారి ఓ యువకుడిపై దమ్ముంటే రారా అంటూ సీరియస్ అయ్యింది అనసూయ.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. 

అయితే ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... ఇటీవలే హొలీ సందర్భంగా నిర్వహించిన ఓ ఈవెంట్ కి యాంకర్ అనసూయ చీఫ్ గెస్ట్ గా వెళ్ళింది. దీంతో ఈ ఈవెంట్ లో డ్యాన్స్ చేస్తూ, హోస్టింగ్ చేస్తూ రంగులు పూస్తూ బాగానే సందడి చేసింది. ఈ క్రమాంలో అనసూయ స్టేజీ మీద ఉన్నప్పుడు ఓ ఆకతాయి ఆంటీ అంటూ పిలిచాడు.. దీంతో అనసూయ మైక్ అందుకుని వెంటనే "నన్నే ఆంటీ అంటావా... 

Also Read :- నయనతారపై మండిపడ్డ డైరెక్టర్.. ఇన్నేళ్ల తర్వాత బయటపెట్టింది

దమ్ముంటే స్టేజీ మీదకి రారా నీ సంగతి తేలుస్తా అంటూ సీరియస్ అయ్యింది.. దీంతో ఆకతాయి భయపడి వెంటనే అక్కడినుంచి వెళ్ళిపోయాడు.. ఇది గమనించిన అక్కడున్నవాళ్ళు ఈ ఇన్సిడెంట్ ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.. దీంతో నెటిజన్లు ఈ వీడియోని  వైరల్ చేస్తున్నారు. అయితే గతంలో అనసూయ తనని ఆంటీ అని పిలిస్తే కేసు పెడతా అంటూ వ్యాఖ్యలు చేసింది.. 

ఈ విషయం ఇలా ఉండగా ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ తో బాగా పాపులర్ అయిన అనసూయ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోయిన్ ఆఫర్స్ కోసం ట్రై చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.. ఆ తర్వాత యాంకరింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. దీంతో సినిమాల ప్రమోషన్స్ ఈవెంట్లు, ఫెస్టివల్ ఈవెంట్లు, స్పెషల్ సాంగ్స్ అంటూ బాగానే రాణిస్తోంది. ప్రస్తుతం ఫుల్ టైమ్ యాక్ట్రెస్ గా ఆఫర్లు అందుకుంటోంది..