మ్యాన్షన్ 24 ట్రైలర్ రిలీజ్..భయపెట్టే వెబ్ సీరిస్తో వస్తున్న ఓంకార్

టాలీవుడ్ టాక్ షోస్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ ఓంకార్(Ohmkar). కథకుడిగ, డైరెక్టర్గా విభిన్న చిత్రాలను తీస్తూ పాజిటివ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. హవీష్ హీరోగా జీనియస్, తన తమ్ముడు అశ్విన్ బాబుని హీరోగా పెట్టి రాజుగారి గాది సీరీస్తో  హిట్ కొట్టి ఇండస్ట్రీలో సత్త చాటాడు. 

ఓంకార్ మరో విభిన్నమైన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తనకు కలిసి వచ్చిన జోనర్ను సెలెక్ట్ చేసుకుని హారర్ కాన్సెప్ట్ తో మ్యాన్షన్ 24(Mansion24) అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ను భయపెట్టడానికి ముందుకు వస్తున్నారు.

లేటెస్ట్గా మ్యాన్షన్ 24 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీని ఫస్ట్ టైం థియేటర్స్లో కాకుండా ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్(Disney+ Hotstar) లో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. 

ట్రైలర్ చూస్తుంటే ఓంకార్ తన మార్క్కు తగ్గట్టుగా హారర్ సీన్స్ తో చూపించారు..ఒక బంగ్లాలోకి వెళ్ళిన తండ్రి కనిపించకుండా పోవడంతో..కూతురు రోల్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ ఎలా కనిపెట్టింది? అసలు తండ్రి సడన్గా కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి?  ఆ నిర్మానుష్యంగా ఉన్న బూతు బంగ్లాలో ఏదైనా దయ్యం ఉందా? అనే కొత్త ప్రశ్నలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

పాత బంగ్లాగా పిలువబడే మ్యాన్షన్ లోకి ఎవరు వెళ్లినా కూడా వెనక్కి రావడం ఇంపాసిబుల్. వేళ్తే రావడం అనేది శవమై గానీ మనిషిగా ఐతే రారు..అనే పాయింట్ ట్రైలర్లో హైలెట్ చేస్తూ ఉన్న హారర్ సీన్స్..ఆసక్తిగా చూపించారు. ఇటువంటి కథలను మనం రెగ్యులర్గా చూస్తూ వస్తున్నాం..కానీ ఓంకార్ తీసే మ్యాన్షన్లో ఏమైనా కొత్త కథ ఉందేమో చూడాలి అంటున్నారు ఓంకార్ అన్నయ్య ఫ్యాన్స్. 

మ్యాన్షన్ నుంచి ఇప్పటికీ  రిలీజైన యాక్టర్స్ పోస్టర్స్..చాలా ఆసక్తిగా డిజైన్ చేసి వదిలారు. సీనియర్ యాక్టర్ సత్యరాజ్ కాళిదాసు అనే క్యారెక్టర్ నటిస్తున్నారు. నటి వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. అలాగే ఈ మూవీలో అవికా గోర్, బిందు మాధవి, యంగ్ హీరో నందు కనిపించబోతున్నారు. క్యాస్టింగ్ పరంగా చాలా ఇంటెన్సివ్ గా ఉన్న ఈ సీరీస్..మరి నిజంగా భయపడుతుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తోంది.