Movie Review: అక్కడ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి X రివ్యూ.. యాంకర్ ప్రదీప్ సినిమాకు టాక్ ఎలా ఉందంటే?

Movie Review: అక్కడ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి X రివ్యూ.. యాంకర్ ప్రదీప్ సినిమాకు టాక్ ఎలా ఉందంటే?

‘30 రోజులలో ప్రేమించడం ఎలా’ చిత్రంతో హీరోగా ఆకట్టుకున్న టీవీ యాంకర్‌‌‌‌‌‌‌‌ ప్రదీప్‌‌‌‌ మాచిరాజు.. ఇప్పుడు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షో క్రియేట‌ర్స్ 'నితిన్, భరత్' దర్శకత్వంలో మాంక్స్ అండ్ మంకీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నేడు శుక్రవారం ఏప్రిల్ 11న గ్రాండ్‌గా రిలీజైంది. అయితే, ఒకరోజు ముందుగానే హైదరాబాద్‌ అండ్ ఓవ‌ర్‌సీస్ లో ప్రీమియర్ షో పడింది. ఈ క్రమంలో సినిమా చూసిన అడియన్స్ సోషల్ మీడియాలో స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు. వారి టాక్ ఎలా ఉందో చూసేద్దాం.

►ALSO READ | Puri Jagannadh : పూరి జగన్నాథ్‌ చిత్రంలో నటి టబు

ప్రీమియ‌ర్స్‌కు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అని, చాలా రోజుల తర్వాత ఒక తెలుగు టైటిల్ తో వచ్చి, ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా సాగిందని పోస్టులు పెడుతున్నారు.

గెట‌ప్ శ్రీను, స‌త్య కామెడీ మధ్య వచ్చే సీన్స్ సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింద‌ని చెబుతున్నారు. అయితే, క‌థాప‌రంగా కొత్త దనం లేకపోయినా, కామెడీతో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ లా, ఆద్యంతం నవ్వించే ప్రయత్నం చేశారని X లో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్ర‌దీప్‌, దీపికా పిల్లి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని చెబుతున్నారు. 

ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'ఈ మూవీ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం. ఫస్టాఫ్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. సెకండాఫ్ సైతం బాగుంది.  గెటప్ శ్రీను, సత్య కామెడీ, తెరపై సూపర్ ఫన్‌ను క్రియేట్ చేసింది. యాంకర్ ప్రదీప్ మరియు దీపిక బాగా నటించారు. వారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ కెమిస్ట్రీ సూపర్బ్ గా ఉంది.ఈ వీకెండ్ లో సినిమా చూస్తూ ఆద్యంతం నవ్వుకోండి. ఎక్కడ బోర్ కొట్టదు' అని పోస్టు పెట్టారు. 

మరో నెటిజన్ స్పందిస్తూ.. ' ఈ మూవీ డీసెంట్ కామెడీ ఎంటర్‌టైనర్. ఫస్టాఫ్ పుష్కలంగా నవ్వులు పూయిస్తుంది. గెటప్ శ్రీను మరియు సత్య మధ్య అద్భుతమైన కామిక్ టైమింగ్‌ కుదిరింది. వారు తమదైన కామెడీతో ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించారు.

ప్రదీప్ మాచిరాజు మరియు దీపికా పిల్లి స్క్రీన్‌పై మంచి కెమిస్ట్రీ కుదిరింది. అద్భుతంగా నటించారు. సెకండాఫ్ కొద్దిగా డల్ అనిపించినప్పటికీ, ఆ కామెడీ వైబ్ బోర్ కొట్టకుండా చేస్తుంది. ఈ వీకెండ్ అదిరిపోతుంది' అంటూ కామెంట్ చేశాడు.