
తెలుగులో పలు షోలు, ఈవెంట్లలో యాంకరింగ్ చేస్తూ అలరించిన ప్రముఖ యాంకర్ ప్రదీప్ అడదపాదడపా సినిమాల్లో హీరోగా కూడా చేస్తూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రదీప్ సరసన మరో ఫీమేల్ యాంకర్ దీపికా పిల్లి నటిస్తోంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ALSO READ | Subham Teaser: అమ్మాయిలు ఆల్ఫా మగాడినే ఇష్ట పడతారు.. లేదంటే పక్కింటోళ్లతో జంప్ అవుతారు..
మొదటగా హీరో ప్రదీప్ కమెడియన్ సత్య కలసి కారులో ప్రయాణిస్తున్న విజువల్స్ తో ట్రైలర్ మొదలవుతుంది. అయితే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన హీరో ఓ కన్స్ట్రక్షన్ పని మీద మారుమూల పల్లెటూరికి వెళతాడు. అయితే ఆ వూళ్ళో కేవలం ఒకే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె హీరోయిన్ రాజా.. హీరో ప్రదీప్ అనుకోకుండా ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు.. ఆ తర్వాత ఎమ్ జరిగిందనే విషయాలు తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ట్రైలర్ లో ఒకట్రెండు డైలాగులు తప్ప మిగతా పెద్దగా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పెద్దగా లేవు.. అలాగే కన్స్ట్రక్షన్ పని మీద వెళ్లిన హీరో ఏదైనా విలేజ్ సమస్యలో ఇరుక్కున్నాడా లేక ప్రేమని దక్కించుకోవడానికి సాహసం చేశాడా అనే విషయాలపై క్లారిటీ లేదు. దీంతో ట్రైలర్ చప్పగా సాగింది. మరి థియేటర్స్ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. అయితే తెలుగులో పలు డ్యాన్స్, కామెడీ షోలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్ నితిన్ భరత్ లు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్స్ లోకి రానుంది.