పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ తో వస్తున్న యాంకర్ ప్రదీప్... హిట్ కొడతాడా..?

పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ తో వస్తున్న యాంకర్ ప్రదీప్... హిట్ కొడతాడా..?

తెలుగు ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై పలు షోలు, ఈవెంట్లు అంటూ ఎక్కువగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఆమధ్య 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా వెండితెరపై మెరిశాడు. కానీ ఈ సినిమా మ్యూజికల్ గా వర్కవుట్ అయ్యింది తప్ప కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. అయితే ఈ చిత్రంలోని నీలినీలి ఆకాశం సాంగ్ ఆడియన్స్ ని కట్టిపడేసింది. 

30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తర్వాత 4 ఏళ్లు గ్యాప్ తీసుకున్న యాంకర్ ప్రదీప్ ఈసారి "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్దామవుతున్నాడు. ఇటీవలే చిత్ర యూనిట్ ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు పోస్టర్లని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

ALSO READ | Samantha: ఆ సమయంలో వారందరూ నాకు సపోర్ట్ చేశారు: సమంత

ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్లు నితిన్ & భరత్ దర్శకత్వం వహిస్తుండగా మాంక్&మంకీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.  ఇక ఈ చిత్రంలో ప్రదీప్ కి జోడీగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ దీపికా పిల్లి నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తీ వివరాలు వెలువడే అవకాశం ఉంది.

అయితే అప్పట్లో టాలీవుడ్ ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ స్వర్గీయ దర్శకుడు ఈవివి సత్యనారాయణ తెరకెక్కించిన "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది. ఈ క్రమంలో ఈ చిత్రం అప్పట్లోనే దాదాపుగా రూ.1.5 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఇప్పుడు ఇదే టైటిల్ తో వస్తున్న యాంకర్ ప్రదీప్ ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో చూడాలి.