
బుల్లితెరపై పలు షోలు, ఈవెంట్లలో యాంకరింగ్ నిర్వహిస్తూ మంచి ఫన్, పంచు డైలాగులతో అలరించేటువంటి యాంకర్ ప్రదీప్ ఓ ప్రముఖ రాజకీయ నాయకురాలని పెళ్లి చేసుకోబోతున్నాడని పలు వార్తలు జోరుగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రదీప్ పెళ్లి ఈ ఏడాది చివరిలో ఉండబోతుందని, ఇప్పటికే మాటమంతి కూడా జరిగిపోయాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో యాంకర్ ప్రదీప్ ఈ పెళ్లి వార్తలపై స్పందించాడు.
ఇందులోభాగంగా తాను ఏపీకి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకురాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేశాడు. ఆలాగే ఈమధ్య తన పెళ్లి బిజినెస్ మెన్ కూతురితో జరగనుందని, క్రికెటర్ కూతురితో జరగనుందని ఇలా పలు రకాల పుకార్లు వినిపించాయని ఈ వార్తలో కూడా ఏలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే పెళ్లి అనేది అందరి జీవితాల్లో చాలా ముఖ్యమైన విషయమని కాబట్టి చాలా అలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పుకొచ్చాడు. ఇక తాను పెళ్లి చేసుకునేప్పుడు కచ్చితంగా అందరికి చెప్పే చేసుకుంటానని తెలిపాడు.
Also Read : ఓ వైపు తారక్ స్టైలిష్ ఫోటోషూట్.. మరోవైపు దుమ్ము రేపుతున్న దేవర వసూళ్లు
ఈ విషయం ఇలా ఉండగా ఈమధ్య యాంకర్ ప్రదీప్ అడపాదడపా సినిమాల్లో కూడా హీరోగా నటిస్తున్నాడు."30 రోజుల్లో ప్రేమించడం ఎలా" సినిమా తర్వాత 4 ఏళ్లు గ్యాప్ తీసుకున్న యాంకర్ ప్రదీప్ ఈసారి "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్లు నితిన్ & భరత్ దర్శకత్వం వహిస్తుండగా మాంక్&మంకీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది.