![Rashmi Gautam: హాస్పిటల్ బెడ్పై యాంకర్ రష్మీ.. ఆందోళనలో ఫ్యాన్స్.. అసలేమైందంటే?](https://static.v6velugu.com/uploads/2025/02/anchor-rashmi-gautam-latest-instagram-post-about-shoulder-surgery_AlPgvbj7nE.jpg)
యాంకర్ కం నటిగా రష్మి గౌతమ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై పలు షోస్కు యాంకర్గా రాణిస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో రష్మి ఎప్పటికప్పుడు ఎంతో చురుగ్గా ఉంటుంది. తను పెట్టె పోస్టులకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. అయితే తాజాగా రష్మిపెట్టిన పోస్ట్ నెటిజన్లని కలవరపెడుతుంది. వివరాల్లోకి వెళితే..
యాంకర్ రష్మి గౌతమ్ లేటెస్ట్గా తన ఇన్స్టా స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసింది. ఈ పోస్ట్లో రష్మి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోలు షేర్ చేయడంతో తన అభిమానులు కంగారు పడుతున్నారు.
Also Read :- బ్లాక్ బస్టర్ తండేల్.. నాలుగు రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
అయితే రష్మి షేర్ చేసిన ఫోటోకి "నేను సర్జరీ కోసం రెడీ అయ్యాను. నా భుజాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంది. దాని వల్ల నాకు ఇష్టమైన డాన్స్ చేయలేకపోతున్నాను. దానికి నేను దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ సర్జరీ అయ్యాక పూర్తిగా సెట్ అవుతుంది.. మళ్ళీ నేను డాన్స్ చేయగలుగుతాను" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుతం రష్మీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాంతో తన ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ.. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ఒరిస్సా బ్యూటీ.. ప్రస్తుతం స్టార్ యాంకర్గా తన హవాను కొనసాగిస్తూనే.. సినిమాల్లో కూడా నటిస్తూ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తోంది.