నటి, బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. యాంకర్‌గా బుల్లితెరకు పరిచయమై..ఆడియాన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. రష్మీ ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే విషయాలపైనా..తనదైన శైలిలో స్పందిస్తూనే..తన కొత్త ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అలా కొన్నిసార్లు రష్మీ చేసే పోస్ట్ లు కాంట్రవర్సీ క్రియేట్ అవుతూ వస్తున్నాయి. ఇక తనపై వచ్చే విమర్శలకు కూడా గట్టిగానే ఆన్సర్ ఇస్తుంది.
రష్మీ కొద్దిరోజులుగా అయోధ్య రామమందిర ప్రారంభం, హిందుత్వం గురించి సోషల్ మీడియాలో అనేక పోస్టులు చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం షేర్ చేస్తుంది. అయితే రష్మీ కాషాయపు రంగు చీర కట్టుకుని..రామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని లైవ్ లో చూస్తూ..జై శ్రీరామ్ నినాదాలు చేసిన వీడియోను ఇంస్టాగ్రామ్లో షేర్ చేసింది.
ఈ పోస్ట్‌పై ఓ నెటిజన్ రిప్లయ్ ఇస్తూ..కాషాయపు రంగు చీర కట్టి.. అన్నీ చెడ్డ పనులు చేస్తున్నావు. అంటూ కాస్త అసభ్య పదజాలం వాడాడు. అలాగే ఆ వీడియోపై కొంతమంది నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేయడంతో..లేటెస్ట్ గా ఓ నెటిజన్‍కు గట్టి కౌంటరిచ్చింది. కొంతమంది నెటిజన్స్ మరి హద్దులదాటి..భిన్నమైన పదజాలం చేసిన వారికి రష్మీ ఇచ్చిపడేసింది.
“నేను బిల్లులు కట్టకుండా ఎగ్గొట్టానా ?..మీ ఉద్దేశ్యం..నా తల్లిదండ్రులను రోడ్డున వదిలేశానా ?..అంటే నా కుటుంబ బాధ్యతలు నేను తీసుకోలేదా ?..గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టలేదా ?..అసలు నేనేమైనా అసాంఘిక కార్యకలాపాలు, ఆకృత్యాలు చేశానా ?..అంతేందుకు ఎవరి దగ్గరైనా డబ్బులు లాగేసుకున్నానా ?..మీరు అంటున్న ఆ పదానికి అసలైన అర్థం ఏంటీ ?.. పదే పదే ఈ పదంతో నన్ను ప్రతిసారి టార్గెట్ చేస్తున్నారు. కాషాయపు రంగు చీరకట్టి, జై శ్రీరాం అని నినదాలు చేసుకుంటూ ఉంటే నన్నెందుకు రెచ్చగొడుతున్నారు. దేవుడు ఎవ్వరికైనా అందరివాడు. అదే సనాతన ధర్మం గొప్పదనం. ధర్మాన్ని, కర్మను బ్యాలెన్స్ చేయడంతో ఆధ్యాత్మికలోని గొప్పదనం తెలుస్తుంది” అంటూ రష్మీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.రష్మీకి మద్దతుగా తన ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కూడా మద్దతు తెలుపుతున్నారు. మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి.
Have I not paid my bills or not taken responsibility of my family
— rashmi gautam (@rashmigautam27) January 23, 2024
Have I left my parents on the roads to fend for themselves
Have I not paid my taxes ?
Am I doing any illegal activities
Have I been charged for anything
What exactly is LANGA PANILU
I have been seeing these… https://t.co/Y0k5kv1AbQ