తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు రవి. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. వరుష షోలతో బిజీగా మారాడు రవి. వేలల్లో ఫ్యాన్స్ ను కూడా సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో కూడా రవి ఎంతో యాక్టివ్ గా ఉంటాడు. అయితే ఇటీవల బిగ్ బాస్ షోలో కూడా రవి పాల్గొన్నాడు. కొన్నిరోజుల పాటు హౌస్ లో ఉండి ఇటీవలే ఎలిమినేట్ అయిపోయాడు. అయితే తాజాగా యాంకర్ రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సామాజిక మాధ్యమాల వేదికగా తనపై కొందరు పెడుతున్న పోస్టులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను రవి కోరాడు.
బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత నెటిజన్లు కొందరు హౌస్ గురించి, హౌస్‌మేట్స్ గురించి నెగిటివ్‌గా మాట్లాడడాన్ని రవి గమనించాడు. కొందరు అయితే హౌస్‌మేట్స్ ఫ్యామిలీని కూడా కమెంట్ చేశారు. దీంతో అలాంటి నెటిజన్స్ కు వార్నింగ్ ఇస్తూ ఆగ్రహంతో రవి ఒక వీడియోను విడుదల చేశాడు. హౌస్‌మేట్స్ నచ్చకపోతే సపోర్ట్ చేయవద్దని, అంతే కానీ నెగిటివ్‌గా మాత్రం మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చాడు. అయినా కొందరు మారలేదు. అందుకే సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ఎవరైనా, ఎవరిగురించైనా తప్పుడు సమాచారం ప్రచారం చేసినా.. ఎవరినైనా కించపరిచేలా మాట్లాడినా.. వారి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు రవి. తప్పు మాట మాట్లాడాలి అన్నా, టైప్ చేయాలి అన్న భయం పుట్టాలి ఇప్పటినుండి అంటూ తాను పోలీసుకు అందిస్తున్న కంప్లైంట్‌ను ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు రవి.