బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ట్విస్ట్..హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ట్విస్ట్..హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన సెలబ్రెటీల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఇవాళ (శుక్రవారం) విచారణకు హాజరు కావాల్సిన యాంకర్, సినీ నటి శ్యామల హైకోర్టును ఆశ్రయించింది. బెట్టింగ్ కేసులో తనమీద నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని యాంకర్ శ్యామల పిటిషన్ లో కోరింది. శ్యామల పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో యాంకర్ శ్యామలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. Andhra365 అనే ఆన్ లైన్ గేమింగ్ యాప్కు యాంకర్ శ్యామల ప్రమోషన్ చేసింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో.. హైకోర్టులో శ్యామల క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన కేసులో ఏడుగురు సినీ నటులతో పాటు 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Also Read:-అన్ స్టాపబుల్ షో చూసి..బెట్టింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాడు...

బెట్టింగ్​యాప్స్​ప్రమోషన్ ​కేసులో యాంకర్​ విష్ణుప్రియ, రీతూచౌదరిని పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే పీఎస్కు పిలిచి విచారించారు. వాళ్లిద్దరికీ పోలీసులు నోటీసులు ఇవ్వగా.. విష్ణుప్రియ తన న్యాయవాదితో పంజాగుట్ట పోలీస్​స్టేషన్‌‌కు వెళ్లింది. ఆమెను డిటెక్టివ్​ఇన్‌‌స్పెక్టర్​శ్రవణ్ కుమార్ విచారించారు. ఆమె విచారణ కొనసాగుతుండగానే రీతూచౌదరి కూడా స్టేషన్‌‌కు వచ్చింది.

ఈ ఇద్దరినీ కలిపి, విడివిడిగా విచారించినట్టు సమాచారం. సుదీర్ఘ విచారణ అనంతరం గురువారం(మార్చి 20, 2025) రాత్రి 9:25 గంటలకు స్టేషన్ నుంచి పంపించారు. దాదాపు 11 గంటల పాటు విష్ణుప్రియను ప్రశ్నించారు. విచారణ సందర్భంగా రీతూచౌదరి పోలీసులకు పలు వివరాలను వెల్లడించినట్టు సమాచారం. విష్ణు ప్రియ చెప్తేనే తాను ప్రమోషన్స్ చేశానని, ప్రమోషన్స్ ఎలా చేయాలో కూడా ఆమెనే తనకు నేర్పించిందని పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.

కాగా, ఈ నెల 25న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. మొదట పోలీసులు విష్ణుప్రియ బ్యాంక్‌‌ లావాదేవీలు పరిశీలించారు. తర్వాత బెట్టింగ్‌‌ యాప్‌‌ల నుంచి వచ్చిన నిధుల గురించి ఆరా తీశారు. తాను కేవలం మూడు బెట్టింగ్‌‌ యాప్‌‌లకు మాత్రమే ప్రమోషన్‌‌ చేశానని విష్ణుప్రియ పోలీసులకు తెలిపినట్టు తెలిసింది. విష్ణుప్రియ ఒక్కో వీడియోకు రూ.90 వేలు తీసుకునేదని, వాటిని ఇన్‌‌స్టాగ్రామ్​ద్వారా ప్రమోట్​చేసేదని తెలిసింది. విష్ణుప్రియ స్టేట్‌‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు.. ఆమె ఫోన్ సీజ్ చేశారు. అయితే ఆ తర్వాత ఇచ్చేశారు. రీతూచౌదరి స్టేట్‌‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు.. ఆమె ఫోన్ సీజ్ చేశారు.