![ఉపాసన పేరుతో యాంకర్ శ్యామల సంచలనం.. అలా మాట్లాడకూడదంటూ..](https://static.v6velugu.com/uploads/2025/02/anchor-shyamala-react-about-megastar-chiranjeevi-and-comedian-prudhvi-controversy_aUV7MLrsyW.jpg)
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మా ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన వారసుడు గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో నేషనల్ వైడ్ గా చిరు వ్యాఖ్యలని వైరల్ చేస్తూ కాంట్రవర్సీ చేస్తున్నారు. అయితే చిరు ఇల్లంతా లేడీస్ హాస్టల్ గా మారిందని చరణ్ ఈసారి మగపిల్లాడిని కనాల్సిందే అంటూ మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలపై కొందరు ఏకంగా ఈ కాలంలో కూడా ఆడ, మగ అంటూ విభేదాలు చూపించడమేంటని చిరుని విమర్శిస్తున్నారు.
అయితే చిరంజీవి వారసుడి వాఖ్యలపై యాంకర్ శ్యామల స్పందించింది. ఇందులో భాగంగా ఇప్పటికాలంలో మగవాళ్ళకి ఆడపిల్లలు ఏమాత్రం తీసిపోరని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే చిరంజీవి కోడలు ఉపాసన చాలా చక్కగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుందని మంచి ఉదాహరణ తీసుకోవచ్చని అలాంటిది లింగ భేదాలని ఉద్దేశిస్తూ ఎందుకు యెలాంటి వ్యాఖ్యలు చేశారో అర్థం కావడంలేదని అన్నారు. ఇక చిరంజీవి కూతుళ్లు, అక్కా చెల్లెల్లు కూడా జీవితంలో చాలా సక్సెఫుల్ గా రాణిస్తున్నారని గుర్తు చేశారు.
ALSO READ | చిరంజీవి వారసుడి వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో విమర్శలు
ఇక లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృద్వీ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందిస్తూ సినిమా ఈవెంట్లకి వెళ్లిన సమయంలో రాజకీయాలని ఉద్దేశిస్తూ మాట్లాడటం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే ఎవరో ఒకరు చేసిన పనికి మొత్తం సినిమా మీద ఎఫెక్ట్ పడుతుందని దీంతో నిర్మాతలు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చింది. అలాగే వ్యక్తిగా విషయాలని సినిమాలపై రుద్దితే చాలా సమస్యలు వస్తాయని ఇకనుంచైనా జాగ్రత్తగా మాట్లాడితే అందరికీ మంచిదని అభిప్రాయం వ్యక్తం చేసింది.