
తనకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, సోషల్ మీడియాలో కూడా దారుణంగా ట్రోల్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు యాంకర్ శ్యామల. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఆమె జగన్ తరుపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో శ్యామల టీడీపీ, జనసేన పార్టీలపై కామెంట్స్ చేశారు. పవన్ ఓడిపోతారని, ఆయన అరవడం తప్పా ఎవరికీ సహాయం చేయడం చూడలేదని మీడియాతో అన్నారు. దాంతో ఆమెను జనసైనికులు ఫుల్లుగా ట్రోల్స్ చేశారు.
ఇక ఇటీవల వచ్చిన ఫలితాల్లో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని సాధించడంతో.. శ్యామల చేసిన కామెంట్స్ గుర్తుచేస్తూ నెటిజన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా తనపై వస్తున్న ట్రోలింగ్ పై వీడియో బైట్ విడుదల చేశారు శ్యామల. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. నాపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. బెదిరింపు కాల్స్ కూడా చేస్తున్నారు. అయినా జగనన్న వెంటే నడుస్తాను. ట్రోల్స్‌ను నేను ఎప్పుడు పట్టించుకోను.
ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే..
— Anchor Shyamala (@AnchorShyamala) June 7, 2024
ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా..ఎన్నికల క్షేత్రం లో ప్రజల తీర్పే అంతిమం...ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమికి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ,పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు.. pic.twitter.com/tEfjUmshLW
నేను ఎవరి గురించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. ఎవరి అభిమానం వారిది. పార్టీ నాకు అప్పగించిన పనిని మాత్రమే నిర్వర్తించాను. భవిష్యత్తులోనూ పార్టీ కోసం కష్టపడతాను. ఇక.. ఏపీలో కొత్తగా ఏర్పాటు కాబోతోంది వారికి నా శుభాకాంక్షలు. కొత్త ప్రభుత్వం ప్రజలకు మరింత అభివృద్ధిని చేయాలని కోరుకుంటున్నాను.. అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు శ్యామల. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.