ఇక చాలు.. కలిసి పోరాడదాం

ఇక చాలు.. కలిసి పోరాడదాం
  • ఫ్రీడమ్ ఫర్ గర్ల్స్ పేరుతో టాస్ యూత్ కన్వెన్షన్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ‘బాలికలపై శారీరక, మానసిక, లైంగిక హింసలు ఇక చాలు.. రండి మారండి కలిసి పోరాడుదాం’ అంటూ తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య (టాస్​) ఫ్రీడమ్ ఫర్ గర్ల్స్ పేరుతో యూత్ కన్వెన్షన్​ ప్రోగ్రాం నిర్వహించింది.

బేగంపేటలోని సెస్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎంవీఎఫ్‌‌ వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్‌‌ శాంతా సిన్హా, యాంకర్ సుమ కనకాల హాజరై మాట్లాడారు. ఎంవీ ఫౌండేషన్​ కో ఆర్డినేటర్​ జె. భాస్కర్​ సంఘం లక్ష్యాలను 
వివరించారు.