
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఛార్జీలు ఎలా ఉన్నాయో ఊహకు అందటం లేదు.. ఎందర్ని ముంచితే.. ఎందరి జీవితాలను నాశనం చేస్తే ఇన్ని ఇన్ని లక్షలు ఇస్తాయి బెట్టింగ్ యాప్స్ కంపెనీలు.. కేవలం సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుయెన్సర్, యాంకర్ అయిన విష్ణుప్రియనే.. నిమిషం వీడియోకు దాదాపు లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తుందంట. ఇలా 15 వీడియోలను ప్రమోట్ చేసినట్లు పంజాగుట్ట పోలీసుల విచారణలో ఆమె వెల్లడించింది.
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి చిక్కు్ల్లో పడిన యాంకర్ విష్ణుప్రియ పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించింది. పంజాగుట్ట పీఎస్లో విచారణకు హాజరైన విష్ణుప్రియ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. 15 బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసినట్లు విష్ణుప్రియ పోలీసులకు వెల్లడించింది. ఒక్కో వీడియోకు రూ.90 వేలు వచ్చినట్టు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్లో విష్ణుప్రియ తెలిపింది.
Also Read : వెయ్యి మంది ఉసురు తీసిన.. సినీ సెలబ్రెటీల బెట్టింగ్ యాప్స్ ప్రచారం
ఈ లెక్కన 15 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన విష్ణుప్రియ లక్షల్లో సంపాదించింది. ఈ కేసులో విష్ణు ప్రియ విచారణ పూర్తయింది. విష్ణు ప్రియ మొబైల్ను పంజాగుట్ట పోలీసులు సీజ్ చేశారు. మూడు గంటల పాటు విష్ణుప్రియను పోలీసులు విచారించారు. యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యువతను ఉద్ధరించకపోయినా పర్లేదు గానీ ఇలా యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి డబ్బులు దండుకోవడంపై నెటిజన్లు మండిపడ్డారు.
బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసి లక్షల్లో కోట్లల్లో దండుకున్నారు సెలబ్రిటీలు. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లు.. స్టార్ డమ్ ను బట్టి లక్షల నుంచి కోట్లల్లో సాగింది ఈ వ్యవహారం. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ విష్ణుప్రియనే నిమిషానికి.. ఒక్కో వీడియోకు 90 వేల రూపాయలు వసూలు చేసిందంటే.. ఇక హీరోలు, హీరోయిన్స్ ఎంతెంత వసూలు చేసి ఉంటారు.. బెట్టింగ్ యాప్స్ నుంచి ఎంతెంత తీసుకుని ఉంటారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. విజయ్ దేవరకొండ, రాణా, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి లాంటి సార్లు.. పాపులర్ ఫిగర్స్ కోట్లలో రెమ్యునరేషన్ వసూలు చేసి ఉండొచ్చు అన్న ప్రచారం జోరుగా సాగుతుంది.
Also Read : బెట్టింగ్ మాఫియాలో 25 మంది హీరో, హీరోయిన్స్
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్పై నిషేధం ఉందన్న సంగతి తెలిసిందే. చట్టం చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి బెట్టింగ్స్ యాప్స్ వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వెయ్యి మంది ఆత్మహత్య చేసుకుంటే.. వేల కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి. అలాంటి బెట్టింగ్స్ యాప్స్కు ప్రచారం చేసిన సినీ హీరో, హీరోయిన్స్, నటులు మాత్రం కోట్లకు కోట్లు సంపాదించుకున్నారు.. ఇదేనా న్యాయం.. ఇదేనా ధర్మం.. ఇదేనా సామాజిక బాధ్యత అంటూ ఇప్పుడు వాళ్ల తీరును దుమ్మెత్తిపోస్తున్నారు జనం. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి పెద్ద పెద్ద నటులు, హీరోల వరకు కేసులు చేస్తున్నారు పోలీసులు. చూడాలి మరి ఇంకెంత మంది సెలబ్రిటీలో బయటికొస్తారో.