బిగ్బాస్ సీజన్ 8 (Bigg Boss Telugu 8) ప్రస్తుతం ఏడో వారం నామినేషన్స్ మంగళవారం (అక్టోబర్ 15న) కంప్లీట్ అయ్యాయి. ఈ ఏడో వారంలో 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారిలో గౌతమ్ కృష్ణ, నిఖిల్, నాగ మణికంఠ, నబీల్, యష్మీ గౌడ, పృథ్వీరాజ్, టేస్టీ తేజ, అవినాష్‌తోపాటు తక్కువ సార్లు హ్యాట్ అందుకున్న ప్రేరణ ఉన్నారు.
ఇక నామినేషన్స్ పూర్తయ్యాక మరుసటి రోజు కంటెస్టెంట్స్ అంతా కూర్చొని ఏంచక్కా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశారు. తాజాగా ఇవాళ జరగబోయే ఎపిసోడ్ (అక్టోబర్ 16)కు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు.
ఈ వీడియోలో ఉదయం గంగవ్వ, విష్ణుప్రియ మాట్లాడుకున్నారు. ఇందులో విష్ణుప్రియ తన తల్లిదండ్రులు వేర్వేరుగా ఉండటం గురించి ఎమోషనల్గా చెప్పడంతో.. . ఈ మాటలు విన్న గంగవ్వ వెంటనే కన్నీళ్లు పెట్టుకుంది.
ALSO READ | Akhanda2: కాదని దాన్ని తాకితే జరిగేది తాండవమే.. అఖండ2లోని డైలాగ్‌తో గర్జించిన బాలకృష్ణ
"నాన్న ఎక్కడ ఉంటడు" అని గంగవ్వ అడిగగా.. "నాన్న ఊరులో ఉంటాడు" అని విష్ణుప్రియ చెబితే.. "మిమ్మల్ని గుర్తు చేసుకోడా" అన్నట్లుగా గంగవ్వ అంది. "మా అమ్మకు నాన్నతో మాట్లాడటం ఇష్టంలేకుండా ఉండే. అమ్మ కోసం నాన్న మీద ఎంత ప్రేమ ఉన్నా, ఎంత మిస్ అయినా కూడా.. నాన్నతో నేను మాట్లాడలేదు" అని విష్ణుప్రియ చెప్పింది. దీంతో గంగవ్వ ఎమోషనల్ అయి ఏడ్చేసింది. ఆ వెంటనే "నీళ్లు వస్తున్నాయి.. ఆయ్.." అని గంగవ్వను విష్ణుప్రియ ఓదార్చింది. ప్రస్తుతం ఈ ప్రోమో బిగ్బాస్ ఫ్యాన్స్ కి ఎమోషనల్ చేస్తోంది. ఇకపోతే కొన్నేళ్ల క్రితం విష్ణుప్రియ తల్లి చనిపోయింది.