మేళ్లచెరువు, వెలుగు : పురాతన వంతెన కుప్పకూలిన ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ సమీపంలో జరిగింది. మేళ్లచెరువు, కోదాడ మధ్య ప్రధాన రహదారిపై కందిబండ శివారులోని వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి.
ప్రమాదకరంగా మారడంతో పోలీసులు వంతెనపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. సోమవారం ఒక్కసారిగా వంతెన కుప్పకూలింది. ఆ సమయంలో వంతెనపై ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈ వంతెన కూలడంతో మేళ్లచెరువు, కోదాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.