వందల ఏళ్లనాటి నాణేలు ..ఆదిలాబాద్ జిల్లా చరిత్రకు సాక్ష్యాలు

వందల ఏళ్లనాటి నాణేలు ..ఆదిలాబాద్ జిల్లా చరిత్రకు సాక్ష్యాలు

వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ : వందల ఏళ్లనాటి నాణేలు చరిత్రకు సాక్ష్యంగా నిలిచాయి.  వాటిని సేకరించిన రచయిత బి.మురళీధర్ మిత్ర మిలన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆదిలాబాద్ కళాక్షేత్రంలో ప్రదర్శనకు ఉంచారు.  క్రీస్తుపూర్వం మొదలుకొని, ఒకటి నుంచి 18వ శతాబ్దం వరకు పాలించిన వివిధ రాజుల కాలం నాటి కాయిన్స్ ను చూసిన సందర్శకులు ఆశ్చర్యపోయారు.  

ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా ప్రాచీన కాలం నుంచే సుసంపన్నమైన ప్రాంతంగా విరాజిల్లిందని, అప్పట్లోనే బంగారు, వెండి నాణేలను వినియోగించిన చరిత్ర మనదని గుర్తు చేశారు. రాగి, సీసం మిశ్రమంతో తయారైన పొటిన్ అనే లోహంతో తయారు చేయడం వల్ల విష్ణుకుండినుల కాలంనాటి నాణేలు చెక్కు చెదరలేదని తెలిపారు.