భారీ భోషాణం..అందులో ఏముందంటే..

భారీ భోషాణం..అందులో ఏముందంటే..

అంత ఉండొచ్చు అన్నారు..ఇంత ఉండొచ్చు అన్నారు. బంగారు ఆభరణాలు...వజ్ర వైఢుర్యాలు ఉండొచ్చని అంచనా వేశారు. ఓపెన్ అయ్యాక చూస్తే అంతా అవాక్కయ్యారు. కర్నూల్ జిల్లా దేవనకోట మండలం కరివేములలో దొరికిన పురాతన భోషాణం మిస్టరీ వీడింది. 

భోషాణం ఎక్కడిది..

దేవనకొండ కరివేములలో కృష్ణారెడ్డి అనే వ్యక్తికి చెందిన ఇంటిని....నర్సింహులు అనే మరో వ్యక్తి కొన్నాడు. పురాతన ఇంటిని జేసీబీలతో కూల్చేసే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో భారీ భోషాణం బయటపడింది. దీంతో ఒక్కసారిగా స్థానికంగా అందులో ఏముందో అన్న ఇంట్రస్ట్ క్రియేట్ అయింది. లాకర్‌లను పోలి ఉన్న ఈ పెట్టెపై ఇంగ్లీషులో మద్రాసు అని రాసివుంది. అంతేకాదు భోషాణంపై లక్ష్మీదేవి బొమ్మ కూడా ఉంది. పురాతనమైనది కావడంతో  అందులో భారీగా బంగారం, వజ్రాలు, వైఢుర్యాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. భారీగా బరువు ఉండటంతో పాటు..భారీ ఇనుపపెట్టెకు  రెండు తాళాలున్నాయి. జేసీబీతో దీన్ని బయటకు తెచ్చారు. 

భోషాణంలో ఏముంది...

ఈ పురాతన భోషాణాన్ని తెరిచేందుకు ఎన్ని  ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.  రెండు తాళాల్లో ఒకటి మాత్రమే ఓపెన్ అయింది. మరొకటి మొరాయించింది. దీంతో గ్యాస్ కట్టర్, సుత్తితో పగలగొట్టేందుకు రెవిన్యూ అధికారులు ప్రయత్నించగా....అందుకు యజమాని నర్సింహులు నిరాకరించారు. ఫైనల్‌గా భారీ ఇనుపపెట్టెను అమ్మవారి ఆలయానికి విరాళంగా ఇస్తున్నట్టు నర్సింహులు ప్రకటించారు. భోషాణంలో ఏమున్నా ఆలయానికే చెందుతుందని స్పష్టం చేశారు. అనేక ప్రయత్నాల తర్వాత  భోషాణాన్ని తెరుచుకుంది. అంతే అంతా అవాక్కయ్యారు. అందులో కొన్ని పాత పేపర్లు, ఇతర పత్రాలు తప్ప ఏమీ లేవు.