మంత్రి సబిత కాళ్లపై పడ్డ వీఆర్ఏల సంఘం గౌరవ అధ్యక్షుడు  

మంత్రి సబిత కాళ్లపై పడ్డ వీఆర్ఏల సంఘం గౌరవ అధ్యక్షుడు  

VRAల సంఘం గౌరవ అధ్యక్షుడు అందే జంగయ్య.. తన VRA ఉద్యోగం తనకు ఇప్పించాలంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాళ్లపై పడ్డాడు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దళితబంధు పథకంపై సమీక్ష నిర్వహించి బయటికు వెళ్తున్న సమయంలో మంత్రి సబిత కాళ్లపై పడ్డాడు. చాలా ఏళ్లుగా తిరుగుతున్నా.. పని జరగడం లేదంటూ మంత్రికి వినతిపత్రం అందించాడు. దీంతో మంత్రి వెంటనే స్పందించి.. సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ను ఆదేశించారు.

ఆరోగ్యం బాగోలేక ఉద్యోగాన్ని తన కుమారుడికి ఇవ్వాలని కోరితే ఉన్న ఉద్యోగం పోయిందని, ఇప్పుడు తన ఆరోగ్యం మెరుగైందని, తన ఉద్యోగాన్ని తిరిగి ఇవ్వాలని వేడుకున్నాడు. తనకు ఉద్యోగం ఇవ్వకుంటే తాను చచ్చిపోతానని వేడుకున్నాడు. అందే జంగయ్య సొంతూరు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతుళ్ళ(తులేకుర్డ్) గ్రామం.