లార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విండీస్‌‌‌‌‌‌‌‌తో అండర్సన్ ఆఖరాట

లార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విండీస్‌‌‌‌‌‌‌‌తో అండర్సన్ ఆఖరాట
  •     రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ పేసర్

లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇంగ్లండ్ లెజెండరీ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జేమ్స్ అండర్సన్ తన రెండు దశాబ్దాల సుదీర్ఘ  క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముగించేందుకు రెడీ అవుతున్నాడు.  జులై 10 నుంచి లార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఇంగ్లండ్ –వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య జరిగే తొలి టెస్టు మ్యాచ్ తనకు చివరిదని శనివారం ప్రకటించాడు. 21 ఏండ్ల కిందట లార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే  జింబాబ్వేపై  టెస్టు అరంగేట్రం చేసిన అతను ఇప్పటివరకు 187 టెస్టుల్లో 700 వికెట్లు తీశాడు. 41 ఏండ్ల అండర్సన్ ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. టెస్టుల్లో  అత్యధిక వికెట్లు తీసిన లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముత్తయ్య మురళీధరన్​ (800), షేన్ వార్న్ (708 ) మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు.

2009లో టీ20 ఫార్మాట్, 2015లో వన్డేల నుంచి తప్పుకున్న అతను టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.  2025–26లో ఆస్ట్రేలియాలో జరిగే యాషెస్ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు ఆటగాళ్లపై ఫోకస్ పెడుతున్నట్టు అండర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంగ్లండ్ టెస్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలియజేశాడు. ఈ నేపథ్యంలో తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగించాలని అండర్సన్ నిర్ణయించుకున్నాడు.