సీఎస్, డీజీపీ ఢిల్లీకి రండి : ఏపీలో అల్లర్లపై కేంద్ర ఈసీ నోటీసులు

ఎపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు రణరంగంగా మారడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది.  రాష్ట్రంలో ఎన్నికల తర్వాత  జరిగిన పలు హింసాత్మక ఘటనలపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై రాష్ట్ర డీజీపీ, సీఎస్ కు నోటీసులు జారీ చేసింది.  ఢిల్లీకి వచ్చిన వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

ఎపీలో మే 13వ తేదీ సోమవారం ఎన్నికలు ముగిసిన అనంతరం.. పల్నాడు, తిరుపతి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నారు. కర్రలు, కత్తులు, ఇనుప రాడ్లతో దారుణంగా ఒకరినొకరు కొట్టుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

Also Read:పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు: అంబటి రాంబాబు

హింసాత్మక ఘటనలు జరుగుతున్న సమస్యాత్మక ప్రాంతాలలో  భారీగా పోలీసులు మొహరించి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. పలువురు టీడీపీ, వైసీపీ నేతలను బయటకు రాకుండా హౌస్ అరెస్టు చేశారు. మరికొంతమంది నాయకులకు మరింత భద్రతను పెంచారు. పల్నాడు, మాచర్ల, జమ్మలమడుగు వంటి ప్రాంతాల్లోల పోలీసులు సెక్షన్ 144 విధించారు. ఈ ప్రాంతాల్లో అడుగడుగునా పోలీసులు మొహరించి.. వాహనాలను జల్లెడపడుతున్నారు.