ఉపాధికోసం గల్ఫ్కు వెళ్లిన మహిళ.. తిరిగొస్తూ.. ఇంటికి చేరేలోపే గుండెపోటుతో..

ఉపాధికోసం గల్ఫ్కు వెళ్లిన మహిళ.. తిరిగొస్తూ.. ఇంటికి చేరేలోపే గుండెపోటుతో..

ఉపాధికోసం గల్ఫ్ బాట పట్టింది ఆ మహిళ..దేశం కానీ దేశం వెళ్లి అష్టకష్టాలు పడుతూ దొరికిన పని చేస్తూ గత కొన్నేళ్లుగా కుటుంబాన్ని ఆదుకుంది.. కష్టం బాధించినా.. ఇద్దరు బిడ్డల భవిష్యత్ ఆమె కళ్లముందు కనబడింది.. తప్పా.. ఆమె ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు.. ఆనారోగ్యం బారిన పడింది..నా అన్నవాళ్లు ఎవరూ లేక..బతికుంటే..సొంతూళ్లోనే పనిచేసుకుని పిల్లల్ని పోషించు కుందాం అనుకుంది.. స్వదేశం బయల్దేరింది.. కానీ విధి వంచించింది.. ఇంకో కొన్ని గంటల్లో ఇంటికి చేరే లోపే.. ఆమె ఆశల దీపం ఆరిపోయింది. 

ఉపాధి కోసం గల్ప్ వెళ్లిన  తూర్పుగోదావరి జిల్లా కోరుమామిడి గ్రామానికి చెందిన సత్య పద్మ.. తిరిగి ఇంటికి చేరే క్రమంలో  గుండెపోటుతో ప్రాణాలొదిలిన ఘటన మంగళవారం (ఆగస్టు 27) న జరి గింది. గల్ఫ్ నుంచి విమానంలో హైదరాబాద్ కు చేరుకున్న సత్యపద్మ తన సొంతూరుకు చేరేక్రమంలో బస్సులో వెళ్లతూ గుండెపోటుకు గురై చనిపోయిన విజువల్స్.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సత్యపద్మ విషాద గాధను నెటిజన్లు కన్నీళ్లు పెడుతున్నారు. 

ALSO READ | లేడి డాక్టర్ పై పేషంట్ దాడి.. అంతా చూస్తుండగానే...

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన ప్రభాకర్‌తో 15 ఏళ్ల క్రితం సత్యపద్మకు పెళ్లిజరిగింది. వారికి ఇద్దరు పిల్లలు.ప్రభాకర్‌కు వచ్చే కొద్దిపాటి ఆదాయం సరిపోకపోవడంతో సత్య పద్మ విదేశాల్లో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది.విజయవాడలోని ఓ కన్సల్టెంట్ ద్వారా సత్య పద్మ ఉద్యోగ నిమిత్తం మస్కట్ వెళ్లింది. అయితే తన జాబ్ ప్రొఫైల్‌కు సరిపోయే పని దొరక్క సత్య పద్మ తనకు దొరికిన దానిలో స్థిరపడింది.

చాలా ఏళ్లుగా మస్కట్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని ఆదుకుంది.కానీ విపరీతమైన పని ఒత్తిడి ఆమెను బాగా పెంచింది. ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఎట్టకేలకు భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయిం చు కుని తన ఏజెంట్‌తో చెప్పింది. కష్టాలు ఒకదాని వెంట ఒకటి చుట్టుముట్టి అనుకోని మరణం ఆమెను వెంటాడింది..  సత్య పద్మ మస్కట్‌ నుంచి స్వదేశానికి వస్తుండగా మృతి చెందింది. కుటుంబ పోషణే లక్ష్యంగా బతికిన సత్య పద్మ ఆకస్మికంగా మరణించిన తీరు పలువురిని కలిచివేసింది.  

సత్య పద్మ కథ కేవలం వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు.. మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ ఇంటిని విడిచివెళ్లే అనేకమంది ఎదుర్కొంటున్న కఠినమైన వాస్తవాలకు ప్రతిబింబం.వారి కుటుంబాల కు మెరుగైన జీవితాన్ని అందించడానికి గల్ఫ్ వలసదారులు ఏమి చేయాల్సి ఉంటుందో గుర్తుచేస్తున్న ఘటన.