1930లో నిజాం ఆంధ్ర జనసంఘం ఆంధ్ర మహాసభగా మారిన తర్వాత ఆంధ్రమహాసభ ఒక రాజకీయ సంస్థగా మారింది. ఆంధ్రమహాసభ తెలుగు భాష అభివృద్ధికి దూరమై ఉండటంతో తెలుగు భాష అభిమానులు తెలుగు భాషాభివృద్ధికి ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో జరిగిన మహాసభ సమావేశంలో 1943లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పాటుపై చర్చించారు. 1943, మే 26న హైదరాబాద్‌లోని గోల్కొండ పత్రిక కార్యాలయంలో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యకలాపాలు మొదట్లో గోల్కొండ పత్రిక కార్యాలయం నుంచి జరిగాయి. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఒక రాజకీయేతర సంస్థగా తెలుగు భాషా వ్యాప్తికి ఏర్పాటు చేశారు.
ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపకుడిగా దేవులపల్లి రామానుజరావు (సారస్వత పరిషత్ పిత)ను పేర్కింటారు.
ఈ సంస్థ స్థాపనలో కీలక పాత్ర పోషించిన వారు దేవులపల్లి, లోకనంది, రంగమ్మ, ఓబుల్‌రెడ్డి.
ఈ సంస్థకు మొదటి అధ్యక్షుడు లోకనంది శంకర్ నారాయణరావు.
ఈ సంస్థ మొదటి కార్యదర్శి వెంకటరెడ్డి శేషయ్య
రెండో అధ్యక్షుడు సురవరం ప్రతాపరెడ్డి
ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రచురించిన పత్రిక ఆంధ్రశ్రీ (1944)
ఆంధ్ర సారస్వత పరిషత్ మొదటి వార్షిక సమావేశం వరంగల్‌లో జరిగింది
సంస్థ ప్రచురించిన ముఖ్యమైన గ్రంథాలు
ఆంధ్ర వాగ్మయ చరిత్ర – దివాకర్ల వెంకట అవధాని
సారస్వత వ్యాసముక్తావళి – బూర్గుల రామకృష్ణారావు
శాలివాహన గాథసప్తశతి – రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ
ఆంధ్రులచరిత్ర–నేలకూరి వెంకట రమణయ్య
సంస్థ కార్యకలాపాలు
గ్రంథాలయ ఏర్పాటును ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టడం
వ్యాసపోటీలు నిర్వహించి బహుమానాలు ఇవ్వడం
తెలుగులో ఉపన్యాసాలు నిర్వహించి ప్రోత్సహించడం.
తెలుగు కవులను రచయితలను సన్మానించడం
తెలుగు పాఠశాల ఏర్పాటు ప్రోత్సహించడం
ఆంధ్ర సారస్వత పరిషత్తు నుంచి వెలువడిన గ్రంథాలు
పండిత సారస్వతం
ప్రజా సారస్వతం
బాల సారస్వతం
ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం నిజాం రాష్ట్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీగా ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు బెజవాడ గోపాలరెడ్డి
తెలంగాణ సాహిత్య పరిషత్
ఆంధ్ర సారస్వత పరిషత్‌ను తెలంగాణ ప్రభుత్వం 2015, మే 21న తెలంగాణ సారస్వత పరిషత్గా మార్చింది. దీనికి మొదటి అధ్యక్షుడిగా సి.నారాయణరెడ్డి వ్యవహరించారు. ప్రస్తుతం యెల్లూరి శివారెడ్డి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ
2017లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసింది. దీని మొదటి అధ్యక్షులుగా నందిని సిద్ధారెడ్డి వ్యవహరించారు. ప్రస్తుతం దీని అధ్యక్షులుగా జూలూరి గౌరీశంకర్ వ్యవహరిస్తున్నారు.