ఓటెయ్యడానికి ఊరి బాట పట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు

ఓటెయ్యడానికి ఊరి బాట పట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు

హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటెయ్యడానికి ఊరి బాట పట్టారు.  ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఓకేసారి ఉండడంతో.. హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో సొంత ఊళ్ళకు పయనమయ్యారు. నిన్ననే కొందరు సొంతూర్లకు వెళ్తే..ఇవాళ చాలా మంది తమ తమ గ్రామాలకు వెళ్తున్నారు. రేపు కూడా జర్నీకి ప్లాన్ చేసుకున్నారు. రైల్వేస్టేషన్లు, బస్సు స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రెగ్యూలర్ సర్వీసులతో పాటు స్పెషల్ సర్వీసులు నిండిపోయాయి. రైల్వే రిజర్వేషన్లు వందకొద్దీ వెయిటింగ్ లిస్టుల్ని చూపిస్తున్నాయి.

చాలా మంది బస్సులు, ప్రైవేటు వెహికల్స్ తోనే సొంతూర్లకు వెళ్తున్నారు. సొంత వెహికల్స్ లోనూ ఓటు వేసుందుకు వెళ్తున్నారు. సిటీ నుంచి వెళ్తున్న వెహికల్స్ తో..టోల్ గేట్స్ దగ్గర రద్దీ పెరిగిపోయింది. టోల్ గేట్స్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో..సెటిలర్స్ ఏపీకి క్యూ కడుతున్నారు. వివిధ పార్టీల నేతలు కూడా…తమ నియోజకవర్గ ఓటర్లని..సొంతూర్లకు రప్పిస్తున్నారు. వెహికల్స్ కూడా ఏర్పాటు  చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు కిరాయి కూడా ఇస్తున్నట్టు చెప్తున్నారు.