ఏపీ మూడు రాజధానులు: సచివాలయం తరలింపు ప్రారంభం

ఏపీ మూడు రాజధానులు: సచివాలయం తరలింపు ప్రారంభం

పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఏపీ ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. రాష్ట్రాన్ని రీజియన్ల వారీగా అభివృద్ధి చేసేందుకు ఏపీ సీఎం జగన్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లు విభజిస్తూ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

నాలుగు రీజియన్లు

ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ

మూడు రాజధానులు

అమరావతి : రాజ్ భవన్, అసెంబ్లీ, సీఎంవో, హైకోర్టు బెంచ్, ప్రభుత్వ క్వార్టర్లు
విశాఖ  : సెక్రటేరియట్, సమ్మర్ అసెంబ్లీ, హై కోర్టు బెంచ్, సీఎం క్యాంప్ ఆఫీస్
కర్నూలు  : హైకోర్టును ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటన్నట్లు ప్రకటించారు.

ప్రకటనలో భాగంగా  వెలగపూడి నుంచి సచివాలయం తరలింపు ప్రారంభమైంది. సచివాలయంలో ఉన్న రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్  ఇంక్వైరీస్ చైర్మన్, సభ్యుల కార్యాలయాలను కర్నూలుకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయ,న్యాయ సంబంధిత కార్యాలయాలన్నింటిని కర్నూలు లో పెడతామని ఇప్పటికే సీఎం ప్రకటన..అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో సచివాలయంలో ఉన్న కార్యాలయాలు తరలిస్తున్నట్లు జీవోలో పేర్కొంది ప్రభుత్వం. కాగా ఇప్పటికే  కార్యాలయాల కోసం అవసరమైన భవనాలు చూడాలని కర్నూలు కలెక్టరు కు,ఆర్ అండ్ బీ అధికారులు కు ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది.