ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల విడుదల చేశారు. విజయవాడలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ SSC డైరెక్టర్ దేవానంద రెడ్డి పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 86.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 84.02 శాతం బాలురు, 89.17 శాతం బాలికలు ఉత్తీర్ణత పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించారు. మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు హాజరైయ్యారు. ఈ విద్యా సంవత్సరం రేపటితో ముగుస్తుండగా.. స్కూల్స్ నడుస్తుండగానే ఫలితాలు విడుదల చేశారు. ఎలక్షన్ కోడ్ కారణంగా ఈ సారి ఇదివరకటి కంటే ముందే టెన్త్ రిజల్ట్స్ ఇచ్చామని అధికారులు తెలిపారు.