వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు..

వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు..

ఏపీలో విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో వచ్చిన వరదల్లో నష్టపోయిన వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం చంద్రబాబు. విజయవాడలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగినవారికి రూ.25 వేలు, ఫస్ట్ ఫ్లోర్, ఆపై ఫ్లోర్లు మునిగినవారికి రూ. 10వేలు అందజేయనున్నట్లు తెలిపారు. కిరాణా షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగినవారికి రూ.25వేలు అందించనున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు.

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు వచ్చిన వారికి రూ. 10వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. 179సచివాలయాల పరిధిలో ఇంటికి రూ.25వేల చొప్పున సాయం అందించనున్నామని, చరిత్రలో తొలిసారి ఇంటికి రూ.25వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు చంద్రబాబు.

పరిశ్రమలకు టర్నోవర్ ను బట్టి సాయం అందిస్తామని, 40లక్షల లోపు టర్నోవర్ ఉంటె రూ.50వేలు అందిస్తామని తెలిపారు. 40లక్షల నుండి 1.5కోట్ల వరకు టర్నోవర్ ఉన్న పరిశ్రమలకు రూ. లక్ష, అంతకుమించి టర్నోవర్ ఉంటే లక్షన్నర రూపాయల సాయం అందిస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు.