
తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఏపీ ప్రభుత్వం తరుపున తిరుమల శ్రీవారికి ఏపీ సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్న జగన్.. మంగళవాయిద్యాల మేళ తాళాల నడుమ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం.. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ వెంట టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారు. ఈ సందర్భంగా 2024 టీటీడీ క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు సీఎం జగన్.
- ALSO READ | తిరుమలలో వీఐపీ దర్శనాలన్నీ రద్దు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. మలయప్ప స్వామి వారి సమక్షంలో గరుడ ధ్వజాన్ని ఎగరవేశారు. వేదపండితుల మంత్రాల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు.