Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదంపై హీరో కార్తి కామెంట్స్.. వార్నింగ్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కార్తి, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌‌లో ‘జాను’ ఫేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘సత్యం సుందరం’ (Satyam Sundaram).  సూర్య, జ్యోతిక నిర్మించారు. సెప్టెంబర్ 28న సినిమా విడుదలవుతున్న సందర్భంగా సోమవారం సెప్టెంబర్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. 

ఈ సందర్భంగా యాంకర్... హీరో కార్తీక్ ను ' లడ్డూ కావాలా నాయనా' అని ఫన్నీగా అడగడంతో..వెంటనే రియాక్ట్ అయ్యారు తమిళ హీరో కార్తీక్. 'ప్రస్తుతం లడ్డూ టాపిక్ అస్సలు మాట్లాడుకోకూడదని ఆయన కోరడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా  లడ్డూ టాపిక్ సెన్సిటివ్గా మారిపోయిందని... ఇలాంటి సమయంలో దాని గురించి తక్కువ మాట్లాడడం బెటర్ అని వ్యాఖ్యానించాడు. 

Also Read:-ఏఆర్ డైరీకి కేంద్ర ఆరోగ్యశాఖ నోటీసులు..

అయితే ఈ వేడుకలో లడ్డుపై హీరో కార్తి మరియు యాంకర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. "లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారు..ఓ సినిమా ఈవెంట్లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అన్నారు. మళ్ళీ ఇంకోసారి అనొద్దు అని పవన్ సూచించారు.

అలాగే ఒక నటుడిగా మీరంటే నాకు చాలా గౌరవం ఉందని.. ఏదైనా మాట్లాడే ముందు.. ఒకటికి వందసార్లు ఆలోచించండి. సనాతన ధర్మాన్ని కాపాడండి అన్నారు" పవన్ కళ్యాణ్. ప్రస్తుతం హీరో కార్తి చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల శ్రీవారి  లడ్డూ కల్తీ అయిందని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.