ఏపీలో మహిళలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్ అందించింది. ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఖరారు చేసింది. ఆగష్టు 15 నుంచి ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగానే ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన వెల్లడైంది. దీంతో ఎప్పుడు అమల్లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న మహిళలకు రానే వచ్చేసింది.
ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది. దీంతో ఏపీ అధికారులు ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించి పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు. ప్రధానంగా జీరో టికెట్ విధానంపై రెండు రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రూట్లకు అనుగుణంగా ఈ పథకాన్ని అమలు చేయాలనే అంశంపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఓ నివేదిక సిద్ధం చేశారు.
A Sincere request to@ncbn @PawanKalyan @naralokesh @SatyaAnagani
— పెత్తర నాయాల (@PettaraNayala) July 16, 2024
on behalf of 45Y+ working women who travels 30-50 kms on daily basis to reach their workplaces regarding #FreeBus scheme
(1/3)#PawanKalyan #ChandrababuNaidu #NaraLokesh #AnaganiSatyaPrasad #AndhraPradesh pic.twitter.com/5FeB67k3Ap