DevaraTicketRates: తెలంగాణ, ఏపీలో దేవర టికెట్ ధరలు.. సింగిల్, మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్లో ఎలా ఉన్నాయి

DevaraTicketRates: తెలంగాణ, ఏపీలో దేవర టికెట్ ధరలు.. సింగిల్, మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్లో ఎలా ఉన్నాయి

మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర (Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కిన దేవర సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది. అటు ఏపీ ఇటు తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకునేందుకు దేవర నిర్మాతలు అనుమతి కోరగా ఇరు ప్రభుత్వాలు ఆమోదం తెలిపారు. మరి దేవర సినిమాకు ఎక్కడ ఎలాంటి టికెట్టు ధరలు ఉన్నాయి..సింగిల్, మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్ లో ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 

తెలంగాణ దేవర టికెట్ ధరలు: 

దేవర సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం (సెప్టెంబర్ 23) అనుమతులు ఇచ్చింది. అదనపు షోలకు ఓకే చెప్పింది. ఫస్ట్ డే సెప్టెంబర్ 27న దేవర సినిమా ఒక్కో టికెట్‍పై రూ.100 అదనంగా ధర పెంచేందుకు తెలంగాణ  సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆ తర్వాత తొమ్మిది రోజులు..'సెప్టెంబరు 27 నుండి 9 రోజుల పాటు అనగా అక్టోబరు 5వరకు' ప్రతిరోజు తెలంగాణవ్యాప్తంగా మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‍పై రూ.50, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‍పై రూ.25 రేటును పెంచుకునేందుకు ఓకే చెప్పింది.

తెలంగాణవ్యాప్తంగా దేవర ఫస్ట్ షో ఉదయం 4 గంటల నుంచి ఆరు షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రెండో రోజు నుంచి పదో రోజు వరకు.. ప్రతీ రోజు ఐదు షోలకు మాత్రమే ఓకే చెప్పింది. ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో అర్ధరాత్రి 1 గంట షోకు మాత్రం 29 థియేటర్లకే తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.

కాగా సింగిల్ స్క్రీన్ లో పెద్ద హీరోలకు ఉండే బాల్కనీ టికెట్ ధర రూ. 175- ఇప్పుడు దేవర సినిమాకి రూ. 295/-గా ఉంది. రూ.110 ల టికెట్ ధర - రూ.235 గా ఉంది. రూ.80 ల టికెట్ ధర  రూ.150 గా ఉంది. 

ఇకపోతే మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో నార్మల్ గా రూ.295/- ఇప్పుడు దేవర సినిమాకి రూ.410 గా ఉంది. రిక్లైనర్ హయ్యెస్ట్ రూ.475 గా ఉంది. 

అయితే.. మల్టీప్లెక్స్ లలో గరిష్ఠంగా రూ.413 నుంచి రూ.475 గా ఉంది. సింగిల్ స్క్రీన్లలో రూ.295 నుంచి 150 గా పరిమితి విధించారు. అయితే, ఫస్ట్ డే మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయి. ఇక రెండో రోజు నుంచి మల్టీప్లెక్స్ లలో గరిష్ఠంగా రూ.354, సింగిల్ స్క్రీన్లలో రూ.206 రేట్లు అమలు చేయనున్నారు.

Also Read:-ఆర్టీసీ క్రాస్ రోడ్ చరిత్రలోనే 'దేవర ‘ఆల్ టైమ్ రికార్డ్’ కొట్టబోతుందా?

ఏపీ దేవర టికెట్ ధరలు:

శనివారం (సెప్టెంబర్ 21)  దేవర సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‍లోని మల్టీప్లెక్స్‌ థియేటర్లలో దేవర సినిమాకు సంబంధించిన ఒక్కో టికెట్‍పై అదనంగా రూ.135 పెంచుకునేందుకు మూవీ టీమ్‍కు ఏపీ సర్కార్ ఓకే చెప్పింది. సింగిల్ స్క్రీన్‍లలో బాల్కనీ టికెట్‍పై అదనంగా రూ.110, లోయర్ క్లాస్‍ టికెట్‍పై రూ.60 అధికం చేసేందుకు అనుమతి ఇచ్చింది.

సెప్టెంబరు 27 నుండి 9 రోజుల పాటు అనగా అక్టోబరు 5వరకు ప్రతిరోజు 5 స్పెషల్ షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే కేవలం 27 తేదీన ఒక్క రోజు మాత్రమే 6 షోలు ప్రదర్శించుకునేలా ఉత్త్వరులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో ఆ రోజున అర్ధరాత్రి 12 గంటలకే తొలి షో పడనుంది.

రెండో రోజు నుంచి మరో తొమ్మిది రోజులు ప్రతీ రోజు 5 షోలు ప్రదర్శించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇక రెండు వారాల వరకు టికెట్లపై అదనపు ధరలు ఉంచుకోవచ్చు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

కాగా సింగిల్ స్క్రీన్ లో పెద్ద హీరోలకు బాల్కనీ రూ. 175/- ఉండే టికెట్ ధర దేవరకు రూ.225/- గా ఉంది. ఫస్ట్ క్లాస్ రూ. 100/- ఉండే టికెట్ ధర రూ.145/- గా ఉంది. ఇకపోతే మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో నార్మల్ గా రూ.175/-ఇప్పుడు రూ.225 గా ఉంది. రిక్లైనర్ హయ్యెస్ట్ రూ.400 గా ఉంది.