ప్రాజెక్టుల అప్పగింతపై కేఆర్ఎంబీకి ఏపీ షరతు

అమరావతి: కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) సమావేశంలో ఆమోదించిన తీర్మానం ప్రకారం  అధికారులు, ప్లాంట్లు, యంత్రాలు, సిబ్బంది అప్పగింతపై జీఓ జారీచేసింది ఏపీ ప్రభుత్వం. కృష్ణా బోర్డు నోటిఫికేషన్ ప్రకారం జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం ఆఫీసులు, వాహనాలు, డీపీఆర్ లు, ఇతర అంశాలను కూడా జీఓలో పొందుపరుస్తూ .. తెలంగాణ ప్రభుత్వం 9 కాంపొనెంట్లను అప్పగించిన వెంటనే తాము ఆరు కాంపొనెంట్లు అప్పగిస్తామని స్పష్టం చేసింది.  హెడ్ వర్కుల పరిధిలోని డ్యామ్ లు, రిజర్వాయర్లు, రెగ్యులేటరీ  స్ట్రక్చర్లు అప్పగిస్తామని తెలియజేసింది.
అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల విషయంలో కూడా తెలంగాణ ఆమోదిస్తేనే తాము కూడా ఓకే చెబుతామని తెలిపింది. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా ఎత్తిపోతల పథకం, ముచ్చుమర్రి పథకం పనులు కూడా అప్పగిస్తామని జీఓలో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.