ఏపీలో కలిపిన ఐదు ఊర్లు తెలంగాణకు!

ఏపీలో కలిపిన ఐదు ఊర్లు తెలంగాణకు!
  •     రేవంత్​రెడ్డి ప్రతిపాదనకు చంద్రబాబు సానుకూలత
  •     కేంద్రానికి లెటర్​ రాయాలని సీఎంల నిర్ణయం?

హైదరాబాద్, వెలుగు: దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఫలప్రదంగా జరిగినట్టు తెలిసింది. ఇందులో ప్రధానంగా.. ఏపీలో కలిపిన ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలను తిరిగి ఇవ్వాలన్న తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి ప్రతిపాదనకు ఏపీ సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ గ్రామాలను తెలం గాణలో కలిపేందుకు రెండు రాష్ట్రాల సీఎంలు కేంద్ర హోంశాఖకు లెటర్​ రాయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 

శనివారం ప్రజాభవన్​లో రెండు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశం మొదలైన తర్వాత సీఎంలు రేవంత్​ రెడ్డి, చంద్రబాబు మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్నందున తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు సహకరించాలని చంద్రబాబును రేవంత్​ కోరారు. ఇక విభజన సమస్యల పరిష్కారానికి కలిసి నడవాలనే ప్రతిపాదన రాగా.. ప్రపంచంలో చర్చలతో పరిష్కారం కానిది ఏదీ ఉండదని ఇద్దరు సీఎంలు అంగీకారం తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు ఉండాల ని.. ఏపీ, తెలంగాణ ప్రజల సెంటిమెంట్, డెవలప్​మెంట్​ ఎక్కడా దెబ్బతినకుండా ముందుకు వెళ్లా లని నిర్ణయించారు. 

కృష్ణా నీటి పంపకాలపై కేం ద్రంతో మాట్లాడి ముందుకు వెళ్లాలని డిసైడ్​ అయినట్టు తెలుస్తున్నది. తెలంగాణ, ఏపీకి తప్పకుండా మంచి జరుగుతుందని.. గతంలో తాను ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, ఇప్పుడు కూడా తనవంతు సహకారం అందించనున్నట్టు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. యువతకు డ్రగ్స్ శాపంగా మారిందని.. ఈ సమస్య రెండు రాష్ట్రాలను వేధిస్తున్నదని సమావేశంలో చర్చించారు. మరో పంజాబ్ లా మారకముందే డ్రగ్స్​ను కట్టడి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదను సీఎం రేవంత్ రెడ్డి చేయగా.. ఏపీ చంద్రబాబు ఓకే చెప్పారు.  డ్రగ్స్, సైబర్ క్రైమ్ కట్టడికి కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఆయన తెలిపారు.

ఆర్డినెన్స్ సవరించాలంటే కేంద్రం అనుమతి మస్ట్​

2014 ఆంధ్రప్రదేశ్​ పునర్విభజన చట్టంలో భాగంగా చివరిక్షణంలో కేంద్రం పోలవరం ఆర్డినెన్స్​ను తీసుకొచ్చి ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసింది. ఈ ఆర్డినెన్స్ సవరిస్తేనే ఐదు గ్రామాలు తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. దీంతో కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించినట్టు తెలిసింది.