
ఏపీలో మద్యం అమ్మకాలు షురూ అయ్యాయి. మందు కొనుక్కోవడానికి ప్రజలు క్యూ పద్దతి ఫాలో అవుతున్నారు. సోమవారం మద్యం కోసం నెల్లూరులో క్యూ పద్దతిలో నిలబడి మద్యం కొనుక్కుంటున్నారు పబ్లిక్. ఏపీలో నేటి నుంచి వైన్ షాపులు తెరుచుకున్న క్రమంలో కొత్త మద్యం ధరలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మద్యం విక్రయాలపై ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు అధికారులు. లిక్కర్ షాపులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటాయి. పెంచిన మద్యం రేట్లను కూడా ఏపీ సర్కారు ప్రకటించింది.
ఆ రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి
1. రూ 120 కన్నా తక్కువ ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ.20 పెంపు
2. హాఫ్ బాటిల్‌పై రూ.40 పెంపు
3. ఫుల్ బాటిల్‌పై రూ.80 పెంపు
4. రూ.120-150 ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ.40 పెంపు
5. హాఫ్ బాటిల్‌పై రూ.80 పెంపు
6. ఫుల్ బాటిల్‌పై రూ.120 పెంపు7. రూ.150 కి పైగా ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ.60 పెంపు
8. హాఫ్ బాటిల్‌పై రూ.120 పెంపు
9. ఫుల్ బాటిల్‌పై రూ.240 పెంపు
మినీ బీర్ పై రూ.20, ఫుల్ బీర్ రూ.30కి పెంచుతున్నట్లు సర్కారు ధరలను నిర్ణయించింది.