
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ సుమారు 4 బిలియన్ డాలర్ల (రూ.32 వేల కోట్ల) ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించేందుకు పాలసీని తెచ్చే పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఇందుకోసం గాను సీఈఓలు–మినిస్టర్లు కలిసి చర్చలు జరిపారని ఈ రాష్ట్ర ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మినిస్టర్ గుడివాడ అమరనాథ్ పేర్కొన్నారు. గ్లోబల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రస్తుతం కీలకమైన జంక్షన్‌లో ఉందని ఆయన వివరించారు.
ప్రపంచస్థాయి ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను అఫోర్డబుల్ రేటులోనే అందుబాటులోకి రావడంపై ఇండియా ఎదురుచూస్తోందని అన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారయ్యి ఇతర దేశాలకు ఎగుమతి అవ్వడాన్ని చూడాలని ఉందన్నారు. ఈవీ సెక్టార్‌ను మరింత విస్తరించడంపై ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుందని వివరించారు. ‘రాష్ట్రాన్ని లైట్‌హౌస్ స్టేట్‌గా మార్చాలని చూస్తున్నాం. సుమారు 4 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించాలని టార్గెట్‌గా పెట్టుకున్నాం’ అని అమరనాథ్ అన్నారు.