ఇటీవల ఏపీలో కురిసిన భారీవర్షాలకు బుడమేరు వాగు ఉప్పొంగి విజయవాడను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం వరదలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. యుద్ధప్రాతిపదికన బుడమేరుకు పడ్డ గండ్లను పూర్చిన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆపరేషన్ బుడమేరు చేపట్టేందుకు ముమ్మరంగా అడుగులేస్తోంది ప్రభుత్వం.
ఆపరేషన్ బుడమేరులో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆక్రమణల వివరాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు. ఎ.కొండూరు నుంచి విజయవాడ వరకు 40 గ్రామాల పరిధిలో 2వేల700 ఎకరాల్లో బుడమేరు ప్రవహిస్తోంది. ఇందులో 270 ఎకరాల మేర ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు అధికారులు.
ALSO READ : అల్లూరి జిల్లాలో విషాదం.. జలపాతంలో కొట్టుకుపోయిన ఐదుగురు మెడికోలు
బుడమేరు ఆక్రమణకు గురైన 40గ్రామాల్లో 3వేల గృహాలు, 80 నిర్మాణాలను గుర్తించినట్లు తెలిపారు అధికారులు. ఆపరేషన్ బుడమేరు వల్ల ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు.