AP IPS Transfe​​​​​​​rs: ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు.. ఆ ముగ్గురిపై వేటు!

ఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. జగన్ ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా పని చేసి టీడీపీని ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలు ఉన్న వారిపై వేటు వేసింది. 

మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రాధాన్యం లేని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది. ఇక ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సునీల్ కుమార్‌ను జేఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించగా.. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీగా ఉన్న రిశాంత్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించి డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఏసీబీ డీజీగా అతుల్ సింగ్‌‌కు, ఫైర్ సేఫ్టి డీజీగా శంకబ్రత బాగ్చీకి అదనపు బాధ్యతలు అప్పగించింది.. రాష్ట్ర ప్రభుత్వం.