తిరుమల శ్రీవారిని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ దంపతులు దర్శించుకున్నారు. 2023 అక్టోబర్22వ తేదీన ఉదయం కుటుంబ సభ్యులతో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, అధికారులు స్వాగతం పలికారు.
Also Read : స్వర్ణరథంపై విహరించిన శ్రీ వేంకటాద్రీశుడు
‘ఇస్తికఫాల్’ ఆలయ మర్యాదలతో అర్చక బృందం, సిబ్బంది స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం పలికారు. ఆ తరువాత టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిలు గవర్నర్ దంపతులకు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని, 2024 టీటీడీ క్యాలెండర్లు డైరీలు అందజేశారు.