ఏప్రిల్ 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

ఏప్రిల్ 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

తీర ప్రాంతాల్లో చేపల వేటపై నిషేధం విధిస్తూ.. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మత్స్య వనరుల పరిరక్షణలో భాగంగా తూర్పు తీరంలో 2024 ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపలవేట నిలిచిపోనుంది. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చేప పిల్లలు ఎదిగే సమయం కావడంతో.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ -జూన్ మధ్య 61 రోజుల పాటు చేపల వేటను నిషేధిస్తారు.

సాధారణ బోట్లు మినహా ఫిషింగ్ బోట్లు, మోటరు బోట్లు నిషేధిత సమయాల్లో వేటకు వెళ్లకూడదని నోటిఫికేషన్​లో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తోపాటు తీరప్రాంతం విస్తరించి ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉందని మత్స్యశాఖ జేడీ విజయకృష్ణ తెలిపారు. 

ALSO READ :- నేను పార్టీ మారను.. బీఆర్ఎస్ కోసం సైనికుడిగా పనిచేస్తా : ఎర్రబెల్లి