రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్

హైదరాబాద్, వెలుగు: 2024–-25 సంవత్సరానికి సంబంధించి రూ. 2.94 లక్షల కోట్ల ప్రతిపాదనతో ఏపీ  బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  అంతకుముందు సీఎం చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీలో సమావేశమైన ఏపీ క్యాబినెట్.. బడ్జెట్ కు ఆమోదం తెలపగా ఫైనాన్స్  మినిస్టర్  పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అలాగే, రూ.43,402.33 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను కూడా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్ర జీఎస్ డీపీలో రెవెన్యూలోటు 4.19శాతంగా, ద్రవ్యలోటు 2.12 శాతంగా ఉంటుదని అంచనా వేశారు.

 2019–-24 మధ్య రాష్ట్రంలో చీకటి రోజులని మంత్రి కేశవ్  వ్యాఖ్యానించారు.  అన్ని రకాలుగా నాటి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసిందని ఆయన విమర్శించారు. కాగా మంగళవారం అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. బుధవారం తిరిగి అసెంబ్లీ స్టార్ట్  కానుంది. మంగళవారం కూటమి  ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ బడ్జెట్  సమావేశాలను వైసీపీ బాయ్ కాట్  చేసింది. ఎమ్మెల్సీలు కౌన్సిల్  సమావేశాలకు మాత్రమే అటెండ్ అయ్యారు.