ఏపీ సీఎం జగన్ 2023 జూన్ 28 బుధవారం రోజున విజయనగరం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు. అక్కడ జగనన్న అమ్మఒడి పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 13 వేల చొప్పున జమచేయనున్నారు. మొత్తం 42 లక్షల 61 వేల 965 మంది తల్లుల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి.
2023 జూన్ 27 వరకు KYC కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి డబ్బులు జమ కానున్నాయి. ఏదైనా సాంకేతిక లోపం ఉన్నట్లు అయితే జూన్ 29న డబ్బులు జమ అవుతాయి. అమ్మఒడి కింద ఇచ్చే రూ.15వేల నుంచి స్కూల్, మరుగుదొడ్ల నిర్వహణ నిధి కోసం రూ.2వేలు మినహాయిస్తున్నారు. మిగతా రూ.13వేలు మాత్రమే తల్లుల బ్యాంకు అకౌంట్‌లో జమ చేస్తారు.
ALSO READ:వ్యూహం నుండి చిరు, పవన్ లుక్స్ రిలీజ్.. 2+2=1 అంటున్న వర్మ
ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి స్కీమ్ వర్తిస్తుంది. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్ కాకుండా పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ వంటి కోర్సుల్లో చేరేవారికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తారు. ఏపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కింద మూడేళ్లలో రూ.19,617 కోట్లు అందించింది.